News September 9, 2024

సోషల్ మీడియా నుంచి ఆ ఫొటోలు తొలగించండి: SC

image

కోల్‌క‌తా హ‌త్యాచార బాధితురాలి ఫొటోల‌ను ఎల‌క్ట్రానిక్, సోషల్ మీడియా నుంచి తొల‌గించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుమ‌తి లేకుండా మృతదేహానికి పోస్టుమార్టం ఎలా చేశార‌ని, అస‌లు పోస్టుమార్టానికి అంగీకార వివ‌రాలు, కార‌ణాలు తెలిపే చ‌లాన్ ఎక్క‌డ‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. మ‌ృతదేహంతోపాటు ఏయే వస్తువులు ఉన్నాయన్నది చలాన్ వెల్లడిస్తుందని, అయితే పోలీసులు దీన్ని అప్పగించలేదని కోర్టుకు CBI తెలిపింది.

Similar News

News October 12, 2024

నవంబర్ 8 నుంచి DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు TGPSC కీలక అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో సెలక్ట్ చేశారు.

News October 12, 2024

పండగకు ఊరెళ్తున్న సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.

News October 12, 2024

మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగే చివరిదైన 3వ T20 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. శనివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవడంతో ఇవాళ వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే ఛాన్సుంది.