News September 15, 2024
చివరి సినిమాకు రూ.275 కోట్ల రెమ్యునరేషన్?
తమిళ హీరో విజయ్ తన చివరి సినిమా ‘దళపతి69’కి భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీ కోసం ఏకంగా రూ.275 కోట్లు తీసుకుంటారని సమాచారం. దీంతో ఇప్పటివరకు భారతదేశంలో ఓ మూవీకి అత్యధిక మొత్తం తీసుకోనున్న నటుడిగా నిలవనున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదల చేస్తారని తెలుస్తోంది. కాగా రెమ్యూనరేషన్పై క్లారిటీ రావాల్సి ఉంది.
Similar News
News October 3, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో రేపు ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
News October 3, 2024
11న మద్యం షాపుల కేటాయింపు: ఎక్సైజ్ శాఖ
AP: రాష్ట్రంలో లాబీయింగ్‌కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, 12 నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
News October 3, 2024
నాలుగు భాషల్లో ప్రసంగించిన పవన్
AP: ‘వారాహి’ డిక్లరేషన్ కార్యక్రమంలో నాలుగు భాషల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. జాతీయ మీడియాకు అర్థమవ్వాలంటూ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఆయన ప్రసంగించారు. దీంతో పాటు తమిళంలోనూ ఆయన మాట్లాడారు. ఇక తెలుగులోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో పవన్‌కు బహు భాషల్లో ప్రావీణ్యం ఉందని ఆయన ఫాలోవర్స్ పోస్టులు చేస్తున్నారు.