News November 13, 2024

రాఘవపురం-రామగుండం రైల్వే లైన్ పునరుద్ధరణ

image

TG: పెద్దపల్లి జిల్లాలో రాఘవపురం-రామగుండం రైల్వే లైన్ పునరుద్ధరణ పనులను రైల్వేశాఖ వేగవంతం చేసింది. అప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాఘవపురం-రామగుండం మధ్య అధికారులు గూడ్స్ రైలును నడిపించారు. నిన్న రాఘవపురం వద్ద గూడ్స్ <<14596360>>రైలు పట్టాలు తప్పడంతో<<>> ఢిల్లీ, చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.

Similar News

News February 7, 2026

పాక్ గెలవలేదు.. మేమే ఓడిపోయాం: నెదర్లాండ్స్ బౌలర్ ఘాటు వ్యాఖ్యలు

image

T20 WCలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్ ఈ మ్యాచ్ గెలవలేదు. మేమే చేజేతులా ఓడిపోయాం’ అని అన్నారు. 148 పరుగుల టార్గెట్ ఛేదనలో పాక్‌ను కట్టడి చేసినా చివరి ఓవర్లలో ఎగ్జిక్యూషన్ లోపించిందని వాపోయారు. ముఖ్యంగా ఫహీమ్ అష్రఫ్ క్యాచ్ మిస్ చేయడం, డెత్ ఓవర్లలో భారీగా రన్స్ ఇవ్వడం తమ గెలుపును దూరం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

News February 7, 2026

శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

APలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్థిక ఇబ్బందులతో తమ వాటా డబ్బులు చెల్లించలేక ఇళ్లు కట్టుకోలేని వారికి రుణాలు సమకూర్చనుంది. ఒక్కొక్కరికి ₹3.65 లక్షల చొప్పున 39వేల మందికి ₹1,423 కోట్లు అందించనుంది. ఈ రుణాన్ని 10.2-11.5% వడ్డీతో 15-20 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ఏడాది జూన్‌కు 2.61 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

News February 7, 2026

మెత్తబడ్డ PCB.. T20 WCలో భారత్-పాక్ పోరు పక్కా?

image

భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు కాస్త మెత్తబడ్డట్లు కనిపిస్తోంది. రూట్ మార్చి ICCతో చర్చలు ప్రారంభించింది. భారీ జరిమానాలు, బైలేటరల్ సిరీస్‌లపై నిషేధం వంటి గట్టి వార్నింగ్‌లు రావడంతోనే పాక్ దారికొచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు కూడా ఆర్థిక నష్టాల దృష్ట్యా ఆడమని కోరింది. దీంతో వచ్చే ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరుపై మళ్లీ ఆశలు చిగురించాయి.