News November 13, 2024
రాఘవపురం-రామగుండం రైల్వే లైన్ పునరుద్ధరణ

TG: పెద్దపల్లి జిల్లాలో రాఘవపురం-రామగుండం రైల్వే లైన్ పునరుద్ధరణ పనులను రైల్వేశాఖ వేగవంతం చేసింది. అప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాఘవపురం-రామగుండం మధ్య అధికారులు గూడ్స్ రైలును నడిపించారు. నిన్న రాఘవపురం వద్ద గూడ్స్ <<14596360>>రైలు పట్టాలు తప్పడంతో<<>> ఢిల్లీ, చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.
Similar News
News November 19, 2025
బంధంలో సైలెంట్ కిల్లర్

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్‌గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.
News November 19, 2025
నల్గొండ: బీసీలకు దక్కేది 166 స్థానాలే

పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీని ప్రకారం జిల్లాలో బీసీలకు 166 స్థానాలు మాత్రమే లభించనున్నాయి. జిల్లాలోని 869 గ్రామపంచాయతీలలో 114 గిరిజన పంచాయతీలు పోగా, 755 జీపీల్లో పాత పద్ధతిలో బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. 166 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కనున్నాయి.
News November 19, 2025
నగరంలో 3 స్థానాలకు ఉపఎన్నికలు?

పార్టీ ఫిరాయించిన MLAలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ తీవ్రజాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే HYDలో తర్వలో 3స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయనే చర్చ నడుస్తోంది. ఖైరతాబాద్ MLA దానంనాగేందర్, శేరిలింగంపల్లి MLA అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ MLA ప్రకాశ్‌గౌడ్, RRలోని చేవెళ్ల MLA కాలె యాదయ్య పార్టీ ఫిరాయించారని, అక్కడ బైపోల్ అనివార్యమని BRS చెబుతూనే ఉంది.


