News May 14, 2024
కాలువలకు మరమ్మతులు చేపట్టాలి: పవన్ కళ్యాణ్
ఏపీలో కాలువల నిర్వహణ పనులపై గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఎన్నికలు ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించి, మరమ్మతుల పనులను వేసవి ముగిసేలోగా పూర్తిచేయాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News January 7, 2025
ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల గడువు పెంపు
AP: ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల సమర్పణ గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వే వివరాలు ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.
News January 7, 2025
కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన అఖిలేశ్
కాంగ్రెస్ పార్టీకి SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆప్‌నకు మరోసారి రావాలని గతంలోనూ ఆయన ఆకాంక్షించారు. తమకు మద్దతిచ్చినందుకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. యూపీతో సరిహద్దును పంచుకొనే ఢిల్లీలో అఖిలేశ్ మద్దతు తమకు లాభం చేకూరుస్తుందని ఆప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News January 7, 2025
కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి
రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్రం తక్షణమే అందజేస్తుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు.