News April 5, 2024
స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపని రెపో రేటు!

రెపో రేట్లో ఎలాంటి మార్పులు చేయట్లేదని RBI ప్రకటించినా అది స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 60 పాయింట్ల స్వల్ప నష్టంతో 74160 వద్ద సెన్సెక్స్.. 24 పాయింట్ల లాస్‌తో 22,490 వద్ద నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. రియల్టీ రంగం షేర్లు రాణించినా ఇతర ప్రధాన రంగాల షేర్లు మందకొడిగా సాగుతున్నాయి. HDFC బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, కొటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
Similar News
News February 11, 2026
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాను కోరిన CM

ఢిల్లీ పర్యటనలో భాగంగా CM చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. APలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. పోలవరం రెండో దశకు రూ.32 వేలకోట్లు అవసరమని జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు.
News February 11, 2026
సంజూ శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్!

NZ సిరీస్‌లో ఫామ్ కోల్పోయి T20 WC తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్11లో చోటు కోల్పోయిన సంజూకు గోల్డెన్ ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్ అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఎల్లుండి నమీబియాతో జరిగే మ్యాచ్‌లో శాంసన్ జట్టులోకి వస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. అందులో రాణిస్తే టీమ్‌లో ప్లేస్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సుందని అంటున్నాయి. అటు సిరాజ్ ప్లేస్‌లో బుమ్రా ఎంట్రీ ఇస్తారని భావిస్తున్నాయి.
News February 10, 2026
T20WC: USAపై పాక్ విజయం

అమెరికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 32 రన్స్ తేడాతో గెలిచింది. 191 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన USA 158/8 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో రంజనే 51, షయాన్ 49, మిలింద్ 29 రన్స్ మినహా ఎవరూ రాణించలేదు. పాక్ బౌలర్లలో తారిఖ్ 3, షాదాబ్ 2 వికెట్లు తీశారు. టోర్నీలో పాక్‌కు ఇది రెండో విజయం కాగా USAకు రెండో ఓటమి.


