News April 16, 2025
ఏపీకి చేరుకున్న 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు

AP: 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు విజయవాడకు చేరుకున్నారు. పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. రేపు సచివాలయంలో అమరావతి ఫొటో గ్యాలరీని వీరు తిలకించనున్నారు. అనంతరం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయంపై వీరితో సీఎం, మంత్రులు రేపు చర్చిస్తారు. రాత్రి తిరుపతికి వెళ్తారు. ఎల్లుండి స్థానిక ప్రజాప్రతినిధులు, వాణిజ్య, వ్యాపారులతో భేటీ అవుతారు.
Similar News
News April 16, 2025
పోలీసుల పనితీరులో దేశంలోనే తెలంగాణ టాప్

పోలీసు విభాగం పనితీరుకు సంబంధించి ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో 6.44Pతో ఏపీ రెండో స్థానం, 6.19Pతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో ప.బెంగాల్ చిట్టచివర నిలిచింది. జ్యుడీషియల్ ర్యాంకింగ్‌లో TGకి 2వ, APకి 5వ స్థానాలు దక్కాయి. అలాగే, ప్రిజన్స్ విభాగంలో ఏపీ 4వ, టీజీ 7వ స్థానంలో నిలిచాయి.
News April 16, 2025
నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారు: నిషాంత్

బిహార్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ తిరిగి CM అవుతారని ఆయన కుమారుడు, JDU నేత నిషాంత్ ధీమా వ్యక్తం చేశారు. 2010 కంటే ఈసారి ఎక్కువ చోట్ల తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిహార్ Dy.CM సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. INDI కూటమి ఎంత పోరాడినా ఫలితం ఉండదన్నారు. అటు నితీశ్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్-RJD వ్యూహాలు రచిస్తోంది.
News April 16, 2025
IPL: తక్కువ స్కోర్లు డిఫెండ్ చేసుకున్న జట్లివే..

111- <<16112625>>పంజాబ్<<>> (v KKR, 2025)*
116- చెన్నై (v PBKS, 2009)
118- హైదరాబాద్ (v MI, 2018)
119- పంజాబ్ (v MI, 2009)
119- హైదరాబాద్ (v PWI, 2013)
120- ముంబై (v PWI, 2012)
125- పంజాబ్ (v SRH, 2021)