News May 24, 2024

BLOలకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని ఈసీకి వినతి

image

AP: ఈ నెల 13న ఒక్కో పోలింగ్ స్టేషన్ నిర్వహణకు రూ.10,000 వ్యయమైందని VROల సంఘం తెలిపింది. ఆ మొత్తాన్ని BLOలు, VROలకు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు వినతిపత్రం అందించింది. కొన్నిచోట్ల రూ.2వేల నుంచి రూ.8వేలే ఇచ్చారని, దీనివల్ల చిరు ఉద్యోగులు నష్టపోతారంది. అలాగే మూడేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసిన BLOలకు రూ.18వేలను రిలీజ్ చేయాలని కోరింది.

Similar News

News March 7, 2026

జాగ్రత్త.. రేపు అన్ని జిల్లాల్లో 36°C-40°C

image

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 3°C-4°C డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో 36°C-40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 38°C-40°C మధ్య టెంపరేచర్ నమోదైందని తెలిపింది.

News March 7, 2026

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామాల్లో 3.60L ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిలో లక్ష యూనిట్లకు ఈ నెల 31లోగా గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులను నిలిపేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకూ అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. APRలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.

News March 7, 2026

మమతకు నాపై కోపం ఉండొచ్చు.. కానీ: ద్రౌపదీ ముర్ము

image

WB పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ ఆదివాసీ సదస్సు కోసం అక్కడికి వెళ్లిన రాష్ట్రపతికి CMతో పాటు అధికారులెవరూ స్వాగతం పలకలేదు. అటు సిలిగుడిలోని సభకు అనుమతి ఇవ్వకుండా వేదికను గోసైన్‌పూర్‌కు మార్చడంపై ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ‘మమతకు నాపై కోపం ఉండొచ్చు. కానీ నాకు ద్వేషం లేదు. ఆమె నాకు సోదరి లాంటివారు. ఆదివాసీలు ఏకం కాకుండా కొందరు అడ్డుకుంటున్నారు’ అని అన్నారు.