News May 12, 2024
ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్.. CSK పోస్ట్ వైరల్

చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ జరుగుతుండగా ఫ్యాన్స్ కోసం CSK ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ‘ఈ మ్యాచ్ తర్వాత వెంటనే వెళ్లిపోకండి. కాసేపు స్టేడియంలోనే ఉండండి. ఒక ప్రత్యేక మెసేజ్ మీ ముందుకు రాబోతోంది’ అని ట్వీట్ చేసింది. ఈ సీజన్‌లో చెన్నై వేదికగా CSKకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
Similar News
News April 17, 2026
ఐ మేకప్ వేసుకుంటున్నారా?

కాజల్, మస్కారా, ఐలైనర్, ఐషాడోలను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కళ్ళకు హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు, ఇది ఎక్కువసేపు కళ్ళ పైన ఉండటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కళ్ళ మెరుపును తగ్గిస్తాయంటున్నారు. అలాగే ఐ మేకప్ ప్రొడక్ట్స్ వాడే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, వాటిని ఇతరులతో పంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందంటున్నారు.
News April 17, 2026
తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు: హార్దిక్

IPL 2026లో MI వరుసగా 4వ మ్యాచ్‌లోనూ ఓటమి పాలవడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చెప్పడానికి ఏం లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదు. జట్టుగా విఫలమవుతున్నామా లేక ఆటగాళ్ల వ్యక్తిగత తప్పిదాలా? ప్లానింగ్‌లో లోపముందా? ఆలోచించుకొని తర్వాత ఏం చేయాలో చూస్తాం’ అని నిన్న PBKSతో ఓటమి తర్వాత అన్నారు. MI ఫెయిల్యూర్‌పై మీ అభిప్రాయం ఏంటి? Comment
News April 17, 2026
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యల ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. దీనికోసం ఆహారంలో బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.


