News January 4, 2025
5 ఎకరాల్లోపే రైతుభరోసా ఇవ్వాలని వినతి
TG: రైతుభరోసా పథకాన్ని 5 ఎకరాలలోపు రైతులకే అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరింది. బీడు భూములకు, వందల ఎకరాలున్న వారికి పథకం అమలు చేస్తే ఖజానాపై భారం పడుతుందని పేర్కొంది. భూస్వాములు, IT చెల్లించే శ్రీమంతులను పథకానికి దూరం చేయాలని కోరింది. కౌలు రైతులను ఈ పథకంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కోసం రేపటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి, జనవరి 14న నగదు జమ చేయనుంది.
Similar News
News January 19, 2025
మాంసంలో నిమ్మ రసం పిండుకుంటున్నారా?
మాంసం కూర తినేటప్పుడు చాలా మంది నిమ్మరసం పిండుకుంటారు. దీనివల్ల రుచితోపాటు పలు ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ రసంలోని విటమిన్-C వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు. హానికరమైన బ్యాక్టీరియా ఉంటే నాశనమవుతుందని, నిమ్మలోని సిట్రస్ యాసిడ్లు కూరకు రుచి మృదుత్వాన్ని చేకూరుస్తాయని అంటున్నారు. అయితే ఆ రసం మోతాదుకు మించొద్దని సూచిస్తున్నారు.
News January 18, 2025
సెమీ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి ఓటమి
ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ డబుల్స్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్‌లో మలేషియా జోడీ గోహ్ స్జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్ 21-18, 21-14 తేడాతో గెలిచింది. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇప్పటికే పీవీ సింధు కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా 21-9, 19-21, 21-17 తేడాతో గెలిచారు.
News January 18, 2025
అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ
AP: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం డిన్నర్ చేశారు.