News September 27, 2024
మూసీ బఫర్ జోన్ నిర్వాసితులకు పునరావాసం, పరిహారం: దానకిశోర్
TG: మూసీ రివర్ బెడ్ నిర్వాసితుల ఆందోళనల నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మూసీ బఫర్‌జోన్‌లో నిర్మాణాలపై సర్వే చేస్తామని, అక్కడ పట్టాలున్న కుటుంబాలకు పునరావాసం, పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. నదీ గర్భంలో పట్టాలున్న వారు జిల్లా కలెక్టర్లను కలవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Similar News
News October 13, 2024
ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు: బండి
TG: రాష్ట్రంలో కులగణన అంతా ఫేక్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఓడిపోతామని గ్రహించి స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ‘రూ.150 కోట్లతో కులగణన అంటూ డైవర్షన్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసింది. మళ్లీ గణన ఎందుకు? ఆ నివేదికను గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ విడుదల చేయలేదు. ఇద్దరి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి?’ అని నిలదీశారు.
News October 13, 2024
అందుకే సినిమాలు తగ్గించాను: దుల్కర్ సల్మాన్
సినిమాలకు విరామం ఇవ్వడానికి గల కారణాన్ని హీరో దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గత రెండేళ్ల నుంచి సినిమాలు తగ్గించాను. గతేడాది ఒక్క సినిమానే చేశా. అది నా తప్పే. అంతకుముందు చెప్పుకోదగ్గ సినిమాలు నా నుంచి రాకవపోడమే ఇందుకు ఓ కారణం. నా ఆరోగ్యం కూడా అంతగా బాలేదు. దీంతో కాస్త విరామం తీసుకున్నా’ అని వెల్లడించారు. కాగా ఆయన నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం అక్టోబర్ 31న రిలీజ్ కానుంది.
News October 13, 2024
హెజ్బొల్లాతో ఘర్షణ.. 30 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
లెబనాన్‌లోని హెజ్బొల్లాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. సౌత్ లెబనాన్‌లో హెజ్బొల్లాతో జరిగిన భీకర ఘర్షణల్లో 30 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. దీంతో ఇజ్రాయెల్-లెబనాన్ బోర్డర్‌లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.