News October 16, 2024
రిజిగ్నేషన్ లెటర్ ఇలా కూడా ఉంటుందా?
కంపెనీ నచ్చకో, మంచి జీతంతో మరో ఉద్యోగం వస్తేనో ప్రస్తుతం పనిచేస్తోన్న కంపెనీకి రాజీనామా చేస్తుంటారు. ఆ సమయంలో బాస్‌కి రిజిగ్నేషన్ లెటర్ సమర్పిస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి తనకు కొత్త కంపెనీ నచ్చకపోతే మళ్లీ తిరిగొస్తానంటూ రాసిన రాజీనామా లేఖ వైరలవుతోంది. ‘నాకు ఓ కంపెనీలో జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్లి ఎలా ఉంటుందో అనుభూతి చెందుతా. నచ్చకపోతే మళ్లీ వచ్చేస్తా’ అని లెటర్‌లో ఉంది.
Similar News
News November 12, 2024
గుండె పదిలంగా ఉండాలంటే..!
పదికాలాల పాటు మీ గుండె పదిలంగా ఉండాలంటే పొట్ట తగ్గించి నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘పోషక ఆహారాన్ని ఎక్కువగా తినండి. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పండ్లు తినాలి. కూల్ డ్రింక్స్ వద్దు. వంటల్లో తక్కువ మోతాదులో ఉప్పు వాడండి. పొట్ట నిండా తినడం మానేయండి. ప్రతిరోజూ అరగంట – గంట వ్యాయామం తప్పనిసరి. మద్యం ముట్టకండి. పొగాకు దరిచేరనీయవద్దు. 7-9 గంటలు పడుకోండి. వీలైనంత ప్రకృతితో గడపండి’ అని తెలిపారు.
News November 12, 2024
BIG BREAKING: గ్రూప్-2 వాయిదా
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు APPSC వెబ్‌సైటును చూడాలని సూచించింది.
News November 12, 2024
MLAలు ప్రజలతో మమేకం కావాలి: CM
AP: NDA MLAలంతా ప్రజలతో మమేకం కావాలని CM చంద్రబాబు కోరారు. NDA శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2029లో మీ అందరినీ MLAలుగా మళ్లీ గెలిపించుకోవాలనుకుంటున్నా. MLA ఛైర్మన్‌గా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. స్థానిక టూరిజం అభివృద్ధికి MLAలు డాక్యుమెంట్ సిద్ధం చేయాలి. ఉచిత ఇసుక విధానం మీరే సక్రమంగా అమలు చేయాలి. సమస్యలు నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా’ అని వెల్లడించారు.