News February 15, 2025

42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో తీర్మానం: సీఎం రేవంత్

image

TG: తాము చేసిన కులగణనలో ఒక్క తప్పున్నా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘మా సర్వేను మొత్తం 5 కేటగిరీలుగా విభజించాం. హిందూ, ముస్లిం బీసీలు కలిపి 56 శాతం అయ్యారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం’ అని చెప్పారు. కాగా అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

Similar News

News April 17, 2026

కేంద్ర మంత్రితో ప్రేమ.. కంగనా రనౌత్ క్లారిటీ!

image

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న రూమర్లపై హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ‘చిరాగ్ నాకు మంచి స్నేహితుడు. మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. పదేళ్ల కిందట మేం కలిసి సినిమా చేశాం. ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికి మాకు పిల్లలు కూడా ఉండే వారు. ఇన్నేళ్లలో మా బంధంలో ఎలాంటి మార్పు లేదు’ అని చెప్పుకొచ్చారు. కంగనా, చిరాగ్ 2011లో ‘మిలే నా మిలే హమ్’ సినిమాలో కలిసి నటించారు.

News April 17, 2026

రోజూ తలస్నానం చేయొచ్చా?

image

రోజూ తలస్నానం చేయడం జుట్టుకు హానికరమనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యం స్కాల్ప్(మాడు) రకం, వాడే షాంపూపైనే ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ తలస్నానం చేస్తే చుండ్రు తొలగి జుట్టు శుభ్రంగా ఉంటుంది. డ్రై స్కాల్ప్ లేదా కలర్డ్ హెయిర్ ఉన్నవారు తరచూ చేస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంది. సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలు వాడితే రోజూ స్నానం చేసినా ప్రాబ్లమ్ ఉండదు.

News April 17, 2026

APPLY NOW: NICలో 153 ఉద్యోగాలు

image

153 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), న్యూఢిల్లీ దరఖాస్తులను కోరుతోంది. వీటిలో సైంటిఫిక్‌-C-12, సైంటిస్ట్-D-141 పోస్టులున్నాయి. B.E/B.Tech/M.Sc/ME /M.Tech/M.Philతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. సైంటిస్ట్‌-Cకు 35, సైంటిస్ట్‌-Dకు 40 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 30.4.26. మరిన్ని వివరాలకు recruitment.nic.in చూడండి.