News November 21, 2024

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తీర్మానం

image

AP: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ దీన్ని సభలో ప్రవేశపెట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉండగా, గతంలో చంద్రబాబు కూడా దీనిపై హామీ ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.

Similar News

News December 14, 2024

హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ప్రకటన చేస్తారని సమాచారం. అలాగే భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వుమెన్స్ వరల్డ్ కప్‌లో కూడా దాయాదులు హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడే అవకాశం ఉంది.

News December 14, 2024

గురుకులాల ఇమేజ్ పెంచుతాం: సీఎం రేవంత్

image

TG: గురుకులాల్లో చదివిన వారు ప్రతిష్ఠాత్మక పదవులు చేపట్టారని CM రేవంత్ అన్నారు. గురుకుల విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తామని చెప్పారు. చిలుకూరులో జరిగిన ‘గురుకులాల బాట’లో CM మాట్లాడారు. ‘ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కంటే గురుకుల విద్యార్థులు తక్కువనే అపోహ ఉంది. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లకు కామన్ డైట్ రూపొందించాం. గురుకులాలను ప్రక్షాళన చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News December 14, 2024

APPLY NOW: 526 ఉద్యోగాలు

image

ITBPలో 526 SI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. SI పోస్టులకు డిగ్రీ/బీటెక్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్/డిప్లొమా, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణత ఉండాలి. SI ఉద్యోగాలకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
వెబ్‌సైట్: <>recruitment.itbpolice.nic.in<<>>