News December 31, 2024
తప్పక తీసుకోవాల్సిన రెజల్యూషన్స్
> పుస్తకాలు చదవడం/వినడం
> రోజూ కనీసం అరగంట వ్యాయామం/యోగా
> పొదుపుతో కూడిన ఆర్థిక క్రమశిక్షణ
> వారానికోసారైనా సన్నిహితుల్ని కలవడం
> సెల్ఫ్ విజన్ బోర్డ్ వేసుకుని రివ్యూ చేయడం
> కొత్త భాష/పని ప్రయత్నించడం
> 2024లో పొరపాట్లు రాసుకుని, ఈసారి వీలైనన్ని తక్కువ జరిగేలా వ్యవహరించడం
Similar News
News January 24, 2025
400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యం!
యూపీ సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద బయటపడిన ఈ నాణేల్లో ఒక దానిపై సీతారాములు, లక్ష్మణుని చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కొన్ని బ్రిటిష్ కాలం నాటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ 21 మంది సాధువుల సమాధులు ఉన్నాయని, ఇటీవల ఓ అస్థిపంజరం బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ స్మారక ప్రదేశం 1920 నుంచి ASI రక్షణలో ఉంది.
News January 24, 2025
మోసం చేసిన భార్య.. దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన 5 నెలలకే తనను వదిలిపెట్టిన భార్యకు భర్త గట్టిగా బుద్ధి చెప్పాడు. రాజస్థాన్ కోటాకు చెందిన మనీశ్ మీనా తన భార్య సప్నను చదివించేందుకు భూమిని తాకట్టు పెట్టి రూ.15 లక్షల లోన్ తీసుకున్నాడు. సప్న 2023లో రైల్వేలో ఉద్యోగం సాధించింది. ఉద్యోగం లేదని భర్తను దూరం పెట్టింది. సప్నకు బదులు డమ్మీ క్యాండిడేట్ ఎగ్జామ్ రాశాడని మనీశ్ ఆధారాలు సమర్పించడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.
News January 24, 2025
వార్నీ.. సేమ్ జెండర్ వ్యక్తుల వందలాది పెళ్లిళ్లు
థాయ్‌లాండ్‌లో ఒకేసారి వందలాది మంది LGBTQ జంటలు వివాహం చేసుకున్నాయి. సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు చట్టబద్ధత కల్పించడంతో వారంతా వరుస కట్టి పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో ఆగ్నేయాసియాలో ఈ చట్టం కలిగిన తొలి దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. 18 కంటే ఎక్కువ వయసున్న వారెవరైనా లింగంతో సంబంధం లేకుండా పెళ్లిచేసుకోవాలని. అలాగే వైఫ్ & హస్బెండ్ అనే పదాలను కూడా ‘స్పౌస్’గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.