News February 8, 2025
RESULTS: ఇప్పటివరకు ఎవరికి ఎన్ని సీట్లు?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 19 చోట్ల విజయం సాధించగా మరో 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు అవసరం. కానీ ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే కాషాయ పార్టీ అంతకుమించిన స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్, సిసోడియా ఓటములతో చతికిలపడ్డ ఆప్ 8 చోట్ల గెలుపొందింది. మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Similar News
News March 21, 2025
ఆరు గ్యారంటీలకు రూ.56 వేల కోట్ల ఖర్చు: భట్టి

TG: BRS హయాంలో GST వృద్ధి రేటు 8.54 ఉంటే తమ హయాంలో 12.3 శాతంగా ఉందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేశామని అసెంబ్లీలో చెప్పారు. ‘ఆరు గ్యారంటీలకే రూ.56 వేల కోట్లు ఖర్చు పెడతాం. బడ్జెట్‌ను కుదించి వాస్తవ లెక్కలు చెప్పాం. చేయగలిగినవే మేం బడ్జెట్‌లో పొందుపరిచాం. పదేళ్లలో రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసి BRS ఏం సాధించింది?’ అని పేర్కొన్నారు.
News March 21, 2025
దుస్తులు మార్చుకుంటుండగా డోర్ తీశాడు: షాలినీ పాండే

ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ దక్షిణాది సినిమాలో నటిస్తున్న సమయంలో నా అనుమతి లేకుండానే ఓ డైరెక్టర్ నా క్యారవాన్ డోర్ తీశాడు. అప్పుడు నేను బట్టలు మార్చుకుంటున్నా. అతడిపై నేను గట్టిగా కేకలు వేయడంతో వెళ్లిపోయారు. డైరెక్టర్ తీరుతో నేను ఎంతో బాధపడ్డా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా షాలినీ పలు సినిమాల్లో నటించారు.
News March 21, 2025
తాడిపత్రిలో ఉద్రిక్తత

AP: అనంతపురం(D) తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. YCP నేత ఫయాజ్ బాషా ఇల్లు అక్రమ నిర్మాణమనే ఆరోపణతో మున్సిపల్ అధికారులు జేసీబీతో తరలివచ్చారు. దానివెంట టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వందలాది మంది అనుచరులతో వచ్చారు. ఈ క్రమంలో ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులూ భారీగా వచ్చి ఎదురుదాడి చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.