News November 23, 2024

నేడే ఫలితాలు.. WAY2NEWSలో EXCLUSIVEగా..

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రియాంకా గాంధీ బరిలో నిలిచిన వయనాడ్‌ సహా నాందేడ్ ఎంపీ స్థానానికి, వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ సీట్ల బైపోల్ రిజల్ట్స్ కూడా వెలువడనున్నాయి. అన్నింటి ఫలితాలను ఎక్స్‌క్లూజివ్‌గా, అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWSలో తెలుసుకోండి. ఎప్పటికప్పుడు రిజల్ట్స్ అప్డేట్స్, అనాలసిస్ స్టోరీస్ అందుబాటులో ఉంటాయి. STAY TUNED.

Similar News

News November 23, 2024

కేరళ బైపోల్స్.. ఆధిక్యంలో BJP అభ్యర్థి

image

కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో బైపోల్స్‌లో మిశ్రమ ఫలితాలు కన్పిస్తున్నాయి. వయనాడ్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక చెలక్కరలో CPM క్యాండిడేట్ ప్రదీప్ లీడ్ కనబరుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్‌పై
పాలక్కాడ్‌లో BJP అభ్యర్థి కృష్ణకుమార్ ఆధిక్యంలో ఉన్నారు.

News November 23, 2024

BREAKING: ఝార్ఖండ్‌లో ఆధిక్యంలో JMM

image

ఝార్ఖండ్‌లో అధికార JMM ఆధిక్యంలోకి వచ్చింది. ఆ పార్టీ 38 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. BJP 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 81 అసెంబ్లీ సీట్లున్న ఝార్ఖండ్‌లో అధికారం చేపట్టాలంటే 41 సీట్లు అవసరం. కాగా బర్హత్‌లో సీఎం హేమంత్ సోరెన్, గండేలో ఆయన భార్య కల్పన సోరెన్ లీడింగ్‌లో ఉన్నారు. మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి సెరైకెల్లాలో చంపై సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు.

News November 23, 2024

మహారాష్ట్ర: కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వెనుకంజ

image

మహారాష్ట్ర ఓట్ల లెక్కింపు ఎర్లీ ట్రెండ్స్‌లో బడా నేతలు వెనకంజలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ నానా పటోలే (సకోలి), మిలింద్ దేవర (వర్లి), జీషన్ సిద్ధిఖీ (వాంద్రె ఈస్ట్) వెనుకంజలో ఉన్నాయి. సీఎం ఏక్‌నాథ్ శిండే (కోప్రి), అజిత్ పవార్ (బారామతి) ఆధిక్యాలు మారుతున్నాయి. కాసేపు ఆధిక్యం, మరికాసేపు వెనుకంజలో ఉంటున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (నాగ్‌పుర్ సౌత్‌వెస్ట్) జోరుమీదున్నారు.