News November 23, 2024

నేడే ఫలితాలు.. WAY2NEWSలో EXCLUSIVEగా..

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రియాంకా గాంధీ బరిలో నిలిచిన వయనాడ్‌ సహా నాందేడ్ ఎంపీ స్థానానికి, వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ సీట్ల బైపోల్ రిజల్ట్స్ కూడా వెలువడనున్నాయి. అన్నింటి ఫలితాలను ఎక్స్‌క్లూజివ్‌గా, అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWSలో తెలుసుకోండి. ఎప్పటికప్పుడు రిజల్ట్స్ అప్డేట్స్, అనాలసిస్ స్టోరీస్ అందుబాటులో ఉంటాయి. STAY TUNED.

Similar News

News December 4, 2024

గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం

image

TG: గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన ‘యువ వికాసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాగా ఏటూరు నాగారం, పెద్దపల్లికి బస్ డిపోలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

News December 4, 2024

రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే భూకంపం వచ్చింది: కౌశిక్ రెడ్డి

image

TG: CM రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చిందని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CM పాపాల నుంచి ప్రజలను దేవుళ్లే కాపాడాలన్నారు. మరోవైపు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ ఆరోపించారు. ఇటీవల తాను ఓ మిత్రుడి పార్టీకి వెళ్తే ఫోన్ ట్యాప్ చేయించి, అక్కడికి పోలీసులను పంపించారన్నారు. తన వద్ద డ్రగ్స్ పెట్టించి కేసులో ఇరికించాలని చూశారని మండిపడ్డారు.

News December 4, 2024

డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన శిండే

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు ఏక్‌నాథ్ శిండే అంగీకరించారు. ఆయన ఇంటికి వెళ్లి సీఎం అభ్యర్థి ఫడణవీస్ చర్చించడంతో బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నారు. రేపు ఆయన ఫడణవీస్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజిత్ పవార్ కూడా డిప్యూటీగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.