News August 8, 2024
రేపే ఫలితాలు
TG: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(CPGET-2024) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణతో కలిసి మ.3.30 గంటలకు రిలీజ్ చేస్తారు. ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
Similar News
News September 10, 2024
విశాఖకు మరో వందేభారత్?
AP: విశాఖకు మరో వందే భారత్ రైలును నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒడిశాలోని దుర్గ్-విశాఖపట్నం మధ్య నడిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌కు వెళ్తుందని తెలుస్తోంది.
News September 10, 2024
ప్రపంచంలోని 20 శాతం చెత్త భారత్‌లోనే
ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో 20 శాతం భారత్‌దేనని ఓ సర్వే తెలిపింది. ఏటా 9.3 మిలియన్ల టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. భారత్ తర్వాత నైజీరియా (3.5 Mt), ఇండోనేషియా(3.4 Mt), చైనా(2.8 Mt), పాకిస్థాన్(2.6 Mt), బంగ్లాదేశ్(1.7 Mt), రష్యా(1.7 Mt), బ్రెజిల్(1.4 Mt), థాయిలాండ్(1 Mt) కాంగో (1 Mt) ఉన్నాయి. ఈ దేశాల్లో ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో చెత్త పెరుగుతోంది.
News September 10, 2024
నేడు తాడేపల్లికి జగన్ రాక
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు. అదే జైల్లో ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా జగన్ కలవనున్నారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.