News September 8, 2024
బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రతిపాదన: మంత్రి నారాయణ

AP: విజయవాడలో విలయం సృష్టించిన బుడమేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నామన్నారు. కాలువల ఆక్రమణల వల్లే వరద తీవ్రత పెరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం బుడమేరుకు గండ్లు పూడ్చినందున మళ్లీ వరద వచ్చే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్స్, స్పోర్ట్స్ వెల్ఫేర్ ఐజీగా గజరావ్ భూపాల్, ఫ్యూచర్ సిటీ ఏసీపీ(అడ్మిన్-ట్రాఫిక్)గా చందనా దీప్తి, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా అపూర్వ రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా అభిషేక్ మహంతీ, సైబరాబాద్ డీసీపీ(అడ్మిన్)గా టి.అన్నపూర్ణ, సీఐడీ ఎస్పీగా వెంకటేశ్వర్లను నియమించింది.
News January 17, 2026
రక్తపాతానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణం: ఖమేనీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రిమినల్ అని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫైరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ట్రంప్ హస్తం ఉందని ఆరోపించారు. ‘దేశంలో జరుగుతున్న విధ్వంసానికి, రక్తపాతానికి విదేశీయులే కారణం. అమెరికా, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న వారు భారీ నష్టాన్ని కలిగించి, వేలాది మందిని చంపారు. దేశాన్ని యుద్ధంలోకి లాగబోం. అలానే స్థానిక, అంతర్జాతీయ నేరస్థులను శిక్షించకుండా వదలబోం’ అని స్పష్టం చేశారు.
News January 17, 2026
RCB అభిమానులకు గుడ్‌న్యూస్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచులు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని KA క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలు, షరతులకు లోబడి మ్యాచులు నిర్వహించుకోవాలని చెప్పినట్లు పేర్కొంది. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. అప్పటి నుంచి స్టేడియంపై నిషేధం ఉంది.


