News September 8, 2024
బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రతిపాదన: మంత్రి నారాయణ
AP: విజయవాడలో విలయం సృష్టించిన బుడమేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నామన్నారు. కాలువల ఆక్రమణల వల్లే వరద తీవ్రత పెరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం బుడమేరుకు గండ్లు పూడ్చినందున మళ్లీ వరద వచ్చే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.
Similar News
News October 11, 2024
తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News October 11, 2024
మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు
AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 చోట్ల షాపులకు ఒక్కోటి చొప్పున, 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
News October 11, 2024
రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి
AP: ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు.