News October 8, 2024

మాపై దాడి చేస్తే ప్రతీకార దాడులు తప్పవు: ఇరాన్

image

తమపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. కాగా ఇటీవల 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 5, 2026

ప్రకాశం హైవేలపై స్పెషల్ టీమ్స్: ఎస్పీ

image

జిల్లాలో ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని జాతీయ రహదారులపై 34 రోడ్ సేఫ్టీ టీమ్లను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలను చేపడుతున్నట్లు ఎస్పీ ప్రకటించారు. అలాగే అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 5, 2026

TODAY HEADLINES

image

☛ TG: మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా: రేవంత్
☛ రేవంత్ ముస్లింల కోసమే పని చేస్తున్నారు: నితిన్ నబీన్
☛ AP: చంద్రబాబుతో పవన్ భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
☛ ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్: CM CBN
☛ గుంటూరులో జగన్ పర్యటన.. కూటమి ప్రభుత్వంపై ఫైర్
☛ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం
☛ U19 WC: ఫైనల్‌కు చేరిన భారత్

News February 5, 2026

చైనా అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్

image

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘మిలిటరీ, ట్రేడ్, APRలో నా చైనా విజిట్‌పై చర్చించాం. చైనా ఈ సీజన్‌లో సోయాబీన్ దిగుమతులను 20M టన్నులకు, వచ్చే ఏడాది 25M టన్నులకు పెంచనుంది. విమాన ఇంజిన్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లపై పాజిటివ్‌గా ఉంది. చైనా, జిన్‌పింగ్‌తో నా వ్యక్తిగత సంబంధాలు ఎంతో బాగున్నాయి. వచ్చే మూడేళ్లలో మంచి ఫలితాలు వస్తాయి’ అని పేర్కొన్నారు.