News October 8, 2024

మాపై దాడి చేస్తే ప్రతీకార దాడులు తప్పవు: ఇరాన్

image

తమపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. కాగా ఇటీవల 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Similar News

News January 15, 2026

హైదరాబాద్ కెప్టెన్‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్‌

image

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లకు హైదరాబాద్ కెప్టెన్‌గా టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 15 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించింది. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్‌లలో సిరాజ్ జట్టును నడిపించనున్నారు. రాహుల్ సింగ్‌ను VCగా ఎంపిక చేశారు. VHTలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్‌రావ్ పేరాల సైతం జట్టులో ఉన్నారు.

News January 15, 2026

పండక్కి అల్లుళ్లను ఇంటికి ఎందుకు పిలుస్తారు?

image

అల్లుడిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో ఆయనకు చేసే మర్యాదలు ఆ నారాయణుడికే చెందుతాయని, దీనివల్ల పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అలాగే, పంట చేతికొచ్చే సమయంలో కూతురు, అల్లుడిని పిలిచి విందులు, వస్త్రదానాలతో సత్కరించడం ద్వారా 2 కుటుంబాల మధ్య బంధం బలపడుతుంది. అందుకే కొత్త అల్లుడు సంక్రాంతికి అత్తవారింటికి రావడం మన సంస్కృతిలో మధురమైన సంప్రదాయంగా మారింది.

News January 15, 2026

అంటురోగాల వ్యాప్తిని గుర్తించేందుకు వెబ్‌లింక్

image

AP: అపరిశుభ్రత, కలుషిత తాగునీటితో వాంతులు, విరేచనాల వంటి అంటురోగాలు ప్రబలుతుంటాయి. వీటిపై స్థానిక సిబ్బందికి, వారినుంచి పై స్థాయికి సమాచారం చేరడంలో జాప్యంతో సమస్య జటిలం అవుతోంది. దీని నివారణ కోసం ప్రజలను భాగస్వాములను చేసేలా వైద్యశాఖ IHIP వెబ్ లింక్‌ను ఏర్పాటుచేసింది. అంటురోగాల సమాచారాన్ని ఫొటోలతో సహా వారు అందులో పొందుపర్చవచ్చు. మరిన్ని వివరాలకు <>క్లిక్<<>> చేయండి.