News March 30, 2024

కాచిన నూనె మళ్లీ వంటలకు వాడుతున్నారా?

image

కాచిన నూనెను మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని అమెరికా సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ అధ్యయనంలో వెల్లడైంది. క్యాన్సర్, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాచిన నూనెల వల్ల శారీరక సమతుల్యత దెబ్బతింటుందని, క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ, కాలేయం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ స్థాయులూ పెరుగుతాయని వెల్లడించారు.

Similar News

News April 9, 2026

ఓటేసిన ప్రముఖులు.. PHOTOS

image

కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. తొలి రెండు గంటల్లో కేరళంలో 16.23, అస్సాంలో 17.87, పుదుచ్చేరిలో 17.71 శాతం పోలింగ్ నమోదైంది. కేరళంలో సీఎం విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, నటులు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓటు వేశారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి బైక్‌పై వచ్చి ఓటేశారు.

News April 9, 2026

రేషన్ కార్డుల రీవెరిఫికేషన్.. అనర్హుల తొలగింపు!

image

TG: అనర్హులకు రేషన్ కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం విజిలెన్స్ విభాగం PAN, GST నంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేసి టెస్టు చేసినట్లు సమాచారం. దీంతో HYDలోనే 2L మంది ట్యాక్స్‌పేయర్స్‌, ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులున్నట్లు తేలిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 80% వెరిఫికేషన్ పూర్తయినట్లు పేర్కొంటున్నాయి. పూర్తి డేటా రాగానే కార్డులను రద్దు చేస్తామంటున్నాయి.

News April 9, 2026

EMIలు కట్టే వారికి గుడ్‌న్యూస్

image

రెపో రేటులో RBI ఎలాంటి మార్పులు <<19596095>>చేయనప్పటికీ<<>> లోన్ EMIలు తగ్గనున్నాయి. 2025లో RBI రెపో రేటులో 1.25%(125 బేసిస్ పాయింట్లు) కోత పెట్టినా బ్యాంకులు మాత్రం కొత్త లోన్లపై 89 BPs, యాక్టివ్ లోన్లపై 87BPs తగ్గించాయి. అంటే మరో 36 BPsను తగ్గించేందుకు అవకాశం ఉంది. వచ్చే 3 నెలల్లో రెపో రేటు కోత ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు అందించనున్నాయి. దీంతో ఇంటి, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది.