News May 18, 2024
హామీలన్నీ అమలు చేసే సత్తా రేవంత్‌కు లేదు: కిషన్ రెడ్డి

TG: కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే సత్తా CM రేవంత్‌కు లేదని TBJP అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆ హామీల అమలు కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది. ఇకపై అన్ని ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయి. BJPకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
కృష్ణా: మామూళ్ల మత్తే కారణమా..?

భారీ లోడుతో, ఫిట్నెస్ లేని వాహనాల కారణంగా ఈ ఏడాది ఉమ్మడి కృష్ణాలో 1500కు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిని తనిఖీ చేసి సీజ్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి వాహనాలను పట్టీపట్టనట్లు వదలడంతోనే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News December 11, 2025
ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News December 11, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


