News May 18, 2024

హామీలన్నీ అమలు చేసే సత్తా రేవంత్‌కు లేదు: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే సత్తా CM రేవంత్‌కు లేదని TBJP అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆ హామీల అమలు కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది. ఇకపై అన్ని ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయి. BJPకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 6, 2024

పుష్ప-2 తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

పుష్ప-2 సినిమాకు తొలిరోజు రూ.294 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. భారత సినీ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. ALL TIME RECORD అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీలో ఈ సినిమాకు ఫస్ట్ డే రూ.72కోట్ల వసూళ్లు వచ్చినట్లు ఇప్పటికే ప్రకటించింది.

News December 6, 2024

MSPతోనే పంటల కొనుగోలు: కేంద్రం

image

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను MSPతో కొనేందుకు మోదీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో తెలిపారు. 2019 నుంచి పంట ఉత్ప‌త్తుల‌ ఖ‌ర్చులో 50% రైతుల‌కు లాభం చేకూర్చేలా MSPని లెక్కిస్తున్నామ‌ని తెలిపారు. రుణ‌మాఫీ అవ‌స‌రం లేకుండా రైతుల ఆదాయం పెంపు, న‌ష్టాల స‌మ‌యంలో ప‌రిహారం వంటి చ‌ర్య‌ల‌తో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే రైతులు MSPకి చట్టబద్ధత డిమాండ్ చేస్తున్నారు.

News December 6, 2024

12వేల ఏళ్ల క్రితమే కుక్కలతో మనిషి బంధం: అధ్యయనం

image

కుక్కలు, మనుషుల మధ్య బంధం 12వేల ఏళ్ల క్రితమే ఉందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అలాస్కాలో లభించిన 12వేల ఏళ్ల నాటి కుక్కల కాలి ఎముకలపై వారు అధ్యయనం నిర్వహించారు. వాటి ఎముకల్లో సాల్మన్ చేప ప్రొటీన్లు లభ్యమయ్యాయి. నాటి కుక్కలు భూమిపైనే వేటాడేవి తప్పితే సాల్మన్ చేపల్ని పట్టుకోవడం కష్టమని.. కచ్చితంగా అవి మనుషులతో కలిసి జీవించినవేనని పరిశోధకులు తేల్చారు.