News January 17, 2025
రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టాడు: KTR
TGలో ఇచ్చిన హామీలు అమలు చేయని CM రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టారని KTR విమర్శించారు. ఆయన వ్యవహారం తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని ట్వీట్ చేశారు. ‘ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, నెలకు ₹2500, తులం బంగారం, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? ₹5లక్షల విద్యాభరోసా ఎక్కడ? ఇక్కడి హామీలకే దిక్కు లేదు.. <<15169364>>ఢిల్లీలో హామీలకు గ్యారంటీ<<>> ఇస్తున్నావా?’ అని ప్రశ్నించారు.
Similar News
News January 17, 2025
సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేవు: పోలీసులు
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో CCTV కెమెరాలు లేకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ముంబై పోలీసులు వెల్లడించారు. విజిటర్స్ను చెక్ చేసేందుకు, ఎమర్జెన్సీ సమయంలో వెంటనే స్పందించేందుకు వారి ఫ్లాట్ ముందు పర్సనల్ గార్డ్స్ కూడా లేరని తెలిపారు. ఆ బిల్డింగ్కు వచ్చే వారి వివరాలు నమోదు చేసేందుకు లాగ్ బుక్ కూడా లేదని చెప్పారు. సెలబ్రిటీలు సెక్యూరిటీ పెట్టుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
News January 17, 2025
ఈ నెలలోనే ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు!
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్లు ‘మనీకంట్రోల్’ తెలిపింది. జనవరి 2025 నుంచి వార్షిక వేతనాలు 6-8 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ APRలో జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ప్రస్తుతం అందులో 3.23 లక్షల ఉద్యోగులు ఉన్నారు.
News January 17, 2025
మంచు మనోజ్ దంపతులపై కేసు నమోదు
AP: మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనికపై చంద్రగిరి పీఎస్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా MBUలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారని మోహన్ బాబు పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మరోవైపు తమపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు పీఏతో పాటు మరో 8 మంది సిబ్బందిపై కేసు నమోదైంది.