News February 1, 2025
రేవంత్.. దమ్ముంటే HYD పేరు మార్చండి: బండి సంజయ్

TG: BJP ఆఫీసున్న వీధి పేరును గద్దర్ పేరిట మారుస్తానని CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘పద్మ అవార్డు ఇవ్వనందుకు ఓ వీధి పేరు మారుస్తానని CM అనడం చూస్తుంటే నవ్వొస్తోంది. గద్దర్‌పై కేసులు పెట్టింది, అవమానించింది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్‌కు దమ్ముంటే ముందుగా HYD పేరును భాగ్యనగర్‌గా, NZB పేరును ఇందూరుగా, MBNR పేరును పాలమూరుగా మార్చాలి’ అని X వేదికగా సవాల్ విసిరారు.
Similar News
News December 10, 2025
ఐబీపీఎస్ SO, PO ఫలితాలు విడుదల

IBPS నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) మెయిన్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <
News December 10, 2025
‘మిస్టర్ ఇండియా’గా CISF జవాన్

జైపూర్(RJ)లో జరిగిన 6వ మిస్టర్ ఇండియా 2025 ఛాంపియన్‌షిప్‌లో CISF కానిస్టేబుల్ రిషిపాల్ సింగ్ అద్భుత విజయం సాధించారు. ఆయన ‘మిస్టర్ ఇండియా’ ట్రోఫీతో పాటు 50+ వయస్సు & 65–70 కేజీల బాడీబిల్డింగ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ గెలిచారు. రిషిపాల్ సింగ్ అంకితభావం & క్రమశిక్షణ ఫోర్స్‌కు గర్వకారణమని CISF ప్రశంసించింది. ఈ విజయం జాతీయ స్థాయిలో CISFకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని కొనియాడింది.
News December 10, 2025
పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

AP: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని పేర్కొంది. FIR నమోదు చేయాలని సూచించింది. మాజీ AVSO పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో CID, ACB అధికారులు వేర్వేరుగా విచారణ చేయొచ్చని తెలిపింది. కేసు వివరాలను ED, ITకి అందజేయాలంది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.


