News February 17, 2025

ఐదేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు: TPCC చీఫ్

image

TG: ఐదేళ్ల పాటు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ, ఏదో ఒక రోజు తెలంగాణకు BCనే సీఎం అవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బీసీ సీఎం అయ్యే అవకాశం కాంగ్రెస్‌లో తప్ప వేరే పార్టీలో లేదు. వచ్చే ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయి. త్వరలో రాష్ట్రంలో చేపట్టబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఉంటుంది’ అని మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు.

Similar News

News April 19, 2026

ఖమేనీ ఖననంపై నో క్లారిటీ?

image

ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ <<19268847>>హతమై<<>> దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆయన అంత్యక్రియలు ఇంకా జరగలేదు. యుద్ధం, భద్రత సహా నిర్వహణలో సవాళ్లే ఇందుకు కారణమని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రభుత్వ లాంఛనాలతో భారీ ఊరేగింపు మధ్య నిర్వహించాలని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో అంత్యక్రియలను వాయిదా వేస్తోంది. కాగా ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు.

News April 19, 2026

KKRతో మ్యాచ్.. RR బ్యాటింగ్

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరగనున్న మ్యాచులో టాస్ గెలిచిన RR కెప్టెన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
RR: జైస్వాల్, వైభవ్, జురెల్, పరాగ్, హెట్మెయర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్, రవి బిష్ణోయ్
KKR: సీఫెర్ట్, రహానే, గ్రీన్, పావెల్, రింకూ సింగ్, నరైన్, రమణ్‌దీప్, అనుకుల్, వైభవ్ అరోరా, కార్తీక్, వరుణ్

News April 19, 2026

కోతుల బెడద.. ఇంటికి రూ.500 వసూలు చేసి..

image

TG: ప్రస్తుతం ప్రతీ గ్రామాన్ని కోతుల సమస్య వేధిస్తోంది. కోతులు ఇళ్లలోకి చొరబడుతుండటం, మనుషులపై దాడులు చేస్తుండటం గ్రామస్థులను కలవరపెడుతోంది. దీని పరిష్కారం కోసం మహబూబాబాద్(D) నర్సింహులపేటలో గ్రామస్థులంతా ఏకమై చందాలు సేకరించారు. ‘కోతుల తరలింపు కార్యక్రమం’ పేరిట ఇంటికి రూ.500, ఎకరానికి రూ.500 చొప్పున వసూలు చేశారు. నిపుణుల బృందంతో కోతులను పట్టించి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.