News August 17, 2024
రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారు: కేటీఆర్

TG: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘రేవంత్ బీజేపీలో చేరుతారు. ప్రధాని మోదీతో ఆయన టచ్‌లో ఉన్నారు. బీజేపీలో మొదలైన తన ప్రస్థానం అక్కడే ముగుస్తుందని మోదీతో రేవంత్ చెప్పారు. నాకున్న ఢిల్లీ సోర్స్ ద్వారా వారి మధ్య సంభాషణ నాకు తెలిసింది. ఇది నిజమా? కాదా? అనేది రేవంత్ స్పష్టం చేయాలి’ అని మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Similar News
News January 17, 2026
IAFకి మరింత బలం.. 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం

ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు మరో 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ₹3.25లక్షల కోట్ల విలువైన ఈ డీల్‌కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీ ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. FEBలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ IND పర్యటనలో డీల్ ఫైనలైజ్ అవ్వొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ సహకారంతో 60%+ స్వదేశీ కంటెంట్‌తో ఇవి తయారు కానున్నాయి. IND రాఫెల్స్ సంఖ్య 176కి పెరగనుంది.
News January 17, 2026
ALERT: ఈ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి

రెండ్రోజులుగా ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్’ పేరిట రూ.5వేలు పొందొచ్చంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ తెగ వైరలైన విషయం తెలిసిందే. తాజాగా సైబర్ కేటుగాళ్లు SBI పేరిట ఇలాంటి లింక్స్, APK ఫైల్స్ పంపుతూ అకౌంట్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.9,980 రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైరీ అని, రూ.5వేలు గిఫ్ట్ అంటూ లింక్స్ పంపి లూటీ చేస్తున్నారు. ఇలాంటి లింక్స్‌పై క్లిక్ చేయకండి. SHARE IT
News January 17, 2026
173 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (UCO) 173 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, IIBF/NIBM, ICAI, BE/BTech, MCA, MSc(cs) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.uco.bank.in. * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


