News August 17, 2024
రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారు: కేటీఆర్
TG: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘రేవంత్ బీజేపీలో చేరుతారు. ప్రధాని మోదీతో ఆయన టచ్‌లో ఉన్నారు. బీజేపీలో మొదలైన తన ప్రస్థానం అక్కడే ముగుస్తుందని మోదీతో రేవంత్ చెప్పారు. నాకున్న ఢిల్లీ సోర్స్ ద్వారా వారి మధ్య సంభాషణ నాకు తెలిసింది. ఇది నిజమా? కాదా? అనేది రేవంత్ స్పష్టం చేయాలి’ అని మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Similar News
News September 18, 2024
సీఎంకు చెక్కు అందజేసిన అనన్య
AP: విజయవాడ వరద బాధితుల కోసం తెలుగు హీరోయిన్ కొన్ని రోజుల క్రితం రూ.2.50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చెక్కును అమరావతిలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. అటు తెలంగాణలోని వరద బాధితులకు సైతం ఈ హీరోయిన్ రూ.2.50 లక్షల విరాళం ప్రకటించారు.
News September 18, 2024
జానీ మాస్టర్‌పై వేటు
అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనను తాత్కాలికంగా తొలగిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
News September 18, 2024
పాక్ క్రికెట్‌ను గాడిలో పెట్టే వ్యక్తులు కావాలి: లతీఫ్
పాకిస్థాన్ క్రికెట్ అంపశయ్య మీద ఉందని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నారు. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు అత్యవసరమని వ్యాఖ్యానించారు. కెప్టెన్ బాబర్ ఆజం మానసిక ఒత్తిడికి గురై ఆటలో రాణించలేకపోతున్నారని చెప్పారు. ఆయన కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల సొంతగడ్డపై జరిగిన టెస్టులో తొలిసారిగా బంగ్లా చేతిలో పాక్ క్లీన్‌స్వీప్‌కు గురికావడం ఆ జట్టు దుస్థితికి అద్దం పడుతోంది.