News March 16, 2024
సీఎం జగన్పై రేవంత్ రెడ్డి పరోక్ష విమర్శలు
AP: దివంగత వైఎస్సార్ సంకల్పం నిలబెట్టినవాళ్లే ఆయన వారసులు అవుతారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వైఎస్ ఆశయాలు మర్చిపోయినవారు ఆయన వారసులు ఎలా అవుతారంటూ సీఎం జగన్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు వైఎస్ బిడ్డ షర్మిల నడుంబిగించారని కొనియాడారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకే పోతారని మండిపడ్డారు.
Similar News
News November 21, 2024
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు పితృవియోగం
AP: నరసాపురం బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు (91) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ఇవాళ మరణించారు. రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. సూర్యనారాయణ రాజు మృతి పట్ల బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి, ముఖ్య నాయకులు సంతాపం తెలిపారు.
News November 21, 2024
పెన్షన్లపై కీలక ఆదేశాలు
AP: పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఇవాళ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా మూడో నెల మొత్తం పింఛన్ ఇస్తామని తెలిపింది. NOV 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, DEC 1న రెండు నెలల పింఛన్ అందిస్తామని వెల్లడించింది. వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ను రద్దు చేస్తామంది. అలాంటి వారు తగిన కారణాలతో WEA/WWDS/MPDO/కమిషనర్లకు విన్నవిస్తే పెన్షన్లను పునరుద్ధరిస్తామని పేర్కొంది.
News November 21, 2024
‘నో లీవ్స్.. జ్వరమొచ్చినా రావాల్సిందే’.. ఆఫీస్ నోటీస్ వైరల్
డిసెంబర్ను విదేశాల్లో వెకేషన్ మంత్గా పరిగణిస్తుంటారు. అక్కడివారందరూ సుదీర్ఘ సెలవులో టూర్లకు వెళ్తుంటారు. దీంతో ఇండియా నుంచి వారికి పనిచేసే కంపెనీలు బిజీ అయిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంపెనీకి చెందిన నోటీస్ వైరలవుతోంది. ‘అత్యంత బిజీగా ఉండే రోజులు కాబట్టి ఈనెల 25 నుంచి డిసెంబర్ 31వరకు సెలవులుండవు. లీవ్స్ బ్లాక్ చేశాం. అనారోగ్యంగా ఉన్నా మినహాయింపులు ఉండవు’ అని సదరు కంపెనీలో నోటీసు అంటించారు.