News May 11, 2024
రేవంత్‌ను సర్జికల్ స్ట్రైక్ ప్రాంతానికి పంపాలి: మాధవీలత

సర్జికల్ స్ట్రైక్ జరిగిన ప్రాంతానికి సీఎం రేవంత్‌రెడ్డిని పంపించాలని HYD బీజేపీ MP అభ్యర్థి మాధవీలత అన్నారు. అప్పుడైనా రేవంత్‌కు సర్జికల్ స్ట్రైక్ నిజంగా జరిగిందా? లేదా? అనే విషయంలో స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికల కోసమే సర్జికల్ స్ట్రైక్ పేరుతో మోదీ నాటకమాడారన్న రేవంత్ విమర్శలకు స్పందనగా మాధవీలత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. రేవంత్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.
Similar News
News March 27, 2026
కొత్త పెన్షన్లపై శుభవార్త

AP: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుపై మంత్రి లోకేశ్ శుభవార్త చెప్పారు. నియోజకవర్గాల్లో చాలా మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని పలువురు మంత్రులు చెప్పగా, ఆ అంశంపై కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఉండవల్లి నివాసంలో జరిగిన అల్పాహార విందు సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62.18 లక్షల మందికి పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తోంది.
News March 27, 2026
బీజేపీకి రూ.6,074 కోట్లు.. 5 పార్టీలకు రూ.574 కోట్లు

FY25లో ఆరు జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR వెల్లడించింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా ఈ మొత్తం సమకూరినట్లు తెలిపింది. కాంగ్రెస్, ఆప్, CPM, NPEPలకు రూ.574 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. రూ.20వేలకు పైబడిన విరాళాలు తమకేమీ రాలేదని BSP ప్రకటించినట్లు వివరించింది. ఈ పార్టీల కంటే 10 రెట్లు ఎక్కువ కమలానికి రావడం గమనార్హం.
News March 27, 2026
పెమ్మసాని.. బ్యాలెట్‌తో తంతే USలో పడతావ్: అంబటి

AP: వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. ‘మాటతోనే చంపే రౌడీవా పెమ్మసాని.. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్‌తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త’ అని ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారు’ అని ఇటీవల జగన్ విమర్శించడంతో ‘ఒక్క మాటతో చంపేయగలం’ అంటూ పెమ్మసాని హెచ్చరించారు.


