News May 11, 2024
రేవంత్‌ను సర్జికల్ స్ట్రైక్ ప్రాంతానికి పంపాలి: మాధవీలత

సర్జికల్ స్ట్రైక్ జరిగిన ప్రాంతానికి సీఎం రేవంత్‌రెడ్డిని పంపించాలని HYD బీజేపీ MP అభ్యర్థి మాధవీలత అన్నారు. అప్పుడైనా రేవంత్‌కు సర్జికల్ స్ట్రైక్ నిజంగా జరిగిందా? లేదా? అనే విషయంలో స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికల కోసమే సర్జికల్ స్ట్రైక్ పేరుతో మోదీ నాటకమాడారన్న రేవంత్ విమర్శలకు స్పందనగా మాధవీలత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. రేవంత్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.
Similar News
News February 14, 2025
TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.. ‘గో రూరల్’ ఆస్తులు సీజ్

TGSRTC బస్సులపై ప్రకటనల పేరుతో గో రూరల్ ఇండియా రూ.21.72 కోట్ల మోసానికి పాల్పడింది. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా తమ అనుబంధ కంపెనీలకు మళ్లించుకుని వ్యాపారం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
News February 14, 2025
మున్షీ స్థానంలో మీనాక్షి

TG: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె రాహుల్ గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. కొంతకాలంగా మున్షీ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.
News February 14, 2025
వచ్చేవారం భారత్-బంగ్లా ‘సరిహద్దు’ చర్చలు

సరిహద్దు సమస్యలపై భారత్-బంగ్లాదేశ్ ఈ నెల 17-20 తేదీల మధ్యలో చర్చలు నిర్వహించనున్నాయి. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, BSF జవాన్లపై బంగ్లా దుండగుల దాడి వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని BSF ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఇరు దేశాల మధ్య ఇదే తొలి అగ్రస్థాయి సమావేశం.