News December 21, 2024

రేవంత్‌ను పిచ్చాసుపత్రిలో చూపించాలి: KTR

image

TG: CM రేవంత్ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద KTR విమర్శించారు. ‘ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని కుటుంబీకులను కోరుతున్నా. ఎవరినో కరిచేలా ఉన్నాడు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రైతుబంధు లేదని, అరకొర రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. కాగా శాసనసభ నిరవధిక వాయిదా పడింది.

Similar News

News January 24, 2025

ఈ బ్లడ్ గ్రూప్ వారు నాన్‌వెజ్ తింటున్నారా?

image

కొందరికి నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగదు. ఎక్కువ మంది చికెన్, మటన్ తినడానికి ఇష్టపడతారు. కొన్ని బ్లడ్ గ్రూపుల వారు మాంసాహారం తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. A బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక వ్యవస్థ సున్నితంగా ఉండి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. చికెన్, మటన్ వంటివి జీర్ణించుకోలేరు. వీరు పప్పులు, కూరగాయలు తినడం బెటర్. B గ్రూప్ వారు ప్రతిదీ తినొచ్చు. AB, O గ్రూప్ వారు సమతుల్యంగా తినాలి.

News January 24, 2025

న్యూయార్క్‌ స్కూళ్లలో మొబైల్ బ్యాన్?

image

USలోని న్యూయార్క్‌ స్కూళ్లలో మొబైల్ వాడకంపై నిషేధం విధించే యోచనలో ఉన్నామని ఆ రాష్ట్ర గవర్నర్ కతి హోచుల్ తెలిపారు. ఇప్పటికే నగరంలోని 1500కు పైగా పబ్లిక్ స్కూళ్లలో సెల్ ఫోన్ వాడకంపై పరిమితులు విధించారని చెప్పారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, చదువుపై ఫోకస్ చేసేందుకు ఈ ప్రణాళిక రచిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, అక్కడి స్కూళ్లలో 97% మంది విద్యార్థులు క్లాస్ నడిచేటప్పుడే ఫోన్ వాడుతున్నారని అంచనా.

News January 24, 2025

ఇకపై ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ.13 లక్షలు కట్టాల్సిందే

image

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి చెల్లించాల్సిన ఫీజును నేపాల్ పెంచింది. ఇకపై ఎవరెస్ట్ ఎక్కాలంటే విదేశీ పర్యాటకులు రూ.13 లక్షలు (15 వేల డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.9.5 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కాగా వచ్చిన డబ్బుతో క్లీన్ అప్ డ్రైవ్స్, వేస్ట్ మేనేజ్‌మెంట్, ట్రెక్కింగ్ కార్యక్రమాలకు వినియోగిస్తారు.