News February 6, 2025

సర్వే పేరుతో బీసీలను రేవంత్ పొడిచి పొడిచి చంపారు: లక్ష్మణ్

image

TG: సమగ్ర సర్వే పేరుతో గతంలో KCR ఒక్కరోజులో బీసీల గొంతు కోస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కులగణన పేరిట 50 రోజులపాటు పొడిచి పొడిచి చంపారని BJP MP కె.లక్ష్మణ్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకని విమర్శించారు. బీసీలపై రేవంత్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే సర్వేలో వారి శాతాన్ని తక్కువచేసి చూపించారని లక్ష్మణ్ ఆరోపించారు.

Similar News

News March 24, 2025

మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్న జెఫ్ బెజోస్

image

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికల పంపిణీ మెుదలు పెట్టారు. ఇటలీ వెనిస్‌లో వీరి మ్యారేజ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ వివాహ తేదీ అధికారికంగా ప్రకటించలేదు. 2023లో వీరి నిశ్చితార్థం జరిగింది. జెఫ్ బెజోస్ 2019తో తన మెుదటి భార్య మెకెంజీతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.

News March 24, 2025

పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్.. ఆరుగురు అరెస్ట్!

image

TG: ఈనెల 21న నల్గొండ జిల్లా నకిరేకల్‌ గురుకులంలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఎగ్జామ్ మొదలైన కాసేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు తాజాగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్‌, డిపార్ట్‌మెంటల్ అధికారి రామ్మోహన్‌ను విధుల నుంచి తొలగించారు. ఇదే కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

News March 24, 2025

జాగ్రత్తగా మాట్లాడితే మంచిది: రజినీకి MP లావు కౌంటర్

image

AP: MP లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆదేశాలతోనే తనపై ACB కేసు పెట్టిందని విడదల రజినీ ఆరోపించడంపై MP స్పందించారు. ‘ఫోన్ డేటా, భూముల విషయాలపై జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఒకరిని విమర్శించే ముందు వివరాలన్నీ తెలుసుకోవాలి. లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్‌కు, నాకూ ఏ సంబంధం లేదని IPS అధికారి పి.జాషువా స్టేట్‌మెంట్‌లో చెప్పారు. స్టోన్ క్రషర్స్‌లో అక్రమాలు జరిగాయని మీరే ఫిర్యాదు చేశారు’ అని అన్నారు.

error: Content is protected !!