News August 8, 2024
రేవంత్ USA టూర్.. పెట్టుబడికి ఓకే చెప్పిన కంపెనీలివే!
అమెరికా పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేవంత్ ఇప్పటివరకూ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలివే. కాగ్నిజెంట్ (15,000 ఉద్యోగాలు), వాల్ష్ కర్రా హోల్డింగ్స్, Arcesium (500 ఉద్యోగాలు), స్వచ్ఛ బయో (500 ఉద్యోగాలు), ట్రైజిన్ టెక్నాలజీస్ (1000 ఉద్యోగాలు), HCA హెల్త్‌కేర్, కార్నింగ్, వివింట్ ఫార్మా (1000 ఉద్యోగాలు), చార్లెస్ స్క్వాబ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Similar News
News September 10, 2024
కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్
TG: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె స్ఫూర్తి అని చెప్పారు. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
News September 10, 2024
మీ స్మార్ట్‌ఫోన్ రేడియేషన్ తెలుసుకోండిలా..!
మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ వెలువడుతుందన్న సంగతి తెలిసిందే. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. దీన్ని స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్(SAR) ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని ఫోన్ కొన్నప్పుడు ఇచ్చే యూజర్ మాన్యువల్ లేదా ఆ సంస్థ వెబ్సైట్లో చూడొచ్చు. లేదంటే మీ ఫోన్లో *#07# డయల్ చేసినా ఆ వివరాల్ని తెలుసుకోవచ్చు.
News September 10, 2024
మలయాళ సినిమాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు థాంక్స్
అల్లు అర్జున్‌కు కేరళలోనూ భారీగా అభిమానులున్న విషయం తెలిసిందే. అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్లూ ఉన్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’ మూవీ ఎండ్కార్డులో ‘ఆల్ కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్& వెల్ఫేర్ అసోసియేషన్’కు మేకర్స్ థాంక్స్ చెప్పారు. హీరోకు ధన్యవాదాలు చెప్పడం కామన్ అని, అభిమానులకూ చెప్పడం bhAAi రేంజ్‌కు నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.