News December 1, 2024

రేవంత్.. రూ.4వేల పెన్షన్ ఎప్పుడిస్తావ్?: కిషన్‌రెడ్డి

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2వేల పెన్షన్‌ను రూ.4వేలు చేస్తామని హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇవ్వాల్సిన రూ.2వేల పెన్షన్ ‌కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. రూ.4వేల పెన్షన్, ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఎప్పుడిస్తావని CM రేవంత్‌ను ప్రశ్నించారు. హామీలు నెరవేర్చే స్థితిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఆయన HYDలో అన్నారు.

Similar News

News December 28, 2025

O-1, L-1, E-2 వీసాలకు డిమాండ్

image

H-1B వీసా నిబంధనలు కఠినం కావడంతో US కంపెనీలు ఇతర వీసాలపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా టాలెంటెడ్ మ్యాన్‌పవర్‌కిచ్చే O-1 వీసాకు డిమాండ్ పెరిగింది. కంపెనీల్లో అంతర్గత బదిలీల కోసం వాడే L-1, ఇన్వెస్టర్లకిచ్చే E-2 వీసాలను ఎంచుకుంటున్నాయి. H-1B లాటరీ గందరగోళం, అదనపు ఫీజుల భారం తప్పుతాయని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. టాలెంట్ ఉన్నవారు ఇకపై ఈ మార్గంలో US వెళ్లే అవకాశం ఉంది.

News December 28, 2025

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ 3 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంఏ(హిందీ) పీహెచ్‌డీ, NET/JRF అర్హత గల అభ్యర్థులు జనవరి 5వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in/

News December 28, 2025

జెప్టో.. రూ.11 వేల కోట్లకు IPO

image

క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి డాక్యుమెంట్లు సమర్పించింది. ఈ IPO ద్వారా సుమారు రూ.11వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026లో మార్కెట్లో లిస్టింగ్ కావాలని భావిస్తోంది. కాగా 2020లో అదిత్, కైవల్య ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దీని విలువ 7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే దీని పోటీదారులైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ (జొమాటో) లిస్ట్ అయ్యాయి.