News November 30, 2024
రేవంత్.. ఏ రైతును బెదిరిస్తున్నావు?: హరీశ్

TG: MBNRలో రైతు పండుగ పేరుతో CM రేవంత్ మరోసారి రైతులను మోసం చేశారని BRS నేత హరీశ్‌రావు అన్నారు. ‘నీ ప్రసంగం చూస్తే రైతులపై ప్రేమ కంటే గిరిజనుల నుంచి భూసేకరణలో విఫలమయ్యాననే ఆవేదనే కనిపించింది.. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని అంటున్నావు. పాలమూరు సాక్షిగా ఏ రైతును బెదిరిస్తున్నావు? అప్పుడు దేవుళ్లపై ఒట్టేసి మాట తప్పావు ఇప్పుడు నీ మంత్రులపై ఒట్టేశావు’ అని హరీశ్ ట్వీట్ చేశారు.
Similar News
News January 16, 2026
గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్

TG: గత ప్రభుత్వం సొంత లాభం మాత్రమే చూసుకుందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రాధాన్యంగా గత ప్రభుత్వం పని చేసింది. ప్రాణాలకు తెగించి మరీ యువకులు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యోగాలు వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైంది. కానీ 2014 నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము TGPSCని ప్రక్షాళించి పరీక్షలు నిర్వహిస్తున్నాం’ అని గ్రూప్-3 నియామకపత్రాల పంపిణీలో తెలిపారు.
News January 16, 2026
ED దాడులు.. బీరువా నిండా రూ.500 నోట్లు

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈడీ చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు దొరికింది. బొగ్గు, బ్లాక్ స్టోన్ అక్రమ మైనింగ్‌పై విచారణ నేపథ్యంలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. PMLA కింద మాఫియా, వారి వ్యాపార భాగస్వాముల ఇళ్లలో దాడులు చేసింది. ఓ బీరువా నిండా నగదు, లగ్జరీ కార్లు, ఆస్తి పత్రాలను గుర్తించింది. ఆ నగదు విలువ ఎంతో త్వరలో వెల్లడిస్తామని ఈడీ తెలిపింది.
News January 16, 2026
14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

TG: రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, ఆర్థికశాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.


