News November 2, 2024
జూన్ కల్లా రేవంత్ను దింపేస్తారు: మహేశ్వర్ రెడ్డి

TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.
Similar News
News December 23, 2025
రైతన్నకు మంచిరోజులు వచ్చేది ఎప్పుడో!

ధనిక, పేద తేడా లేకుండా అందరి ఆకలి తీర్చేది రైతు పండించే మెతుకులే. దాని కోసం రైతు పడే కష్టం, మట్టితో చేసే యుద్ధం వెలకట్టలేనిది. తెల్లవారుజామునే నాగలి పట్టి పొలానికి వెళ్లే అన్నదాతే అసలైన హీరో. తన రక్తాన్ని చెమటగా మార్చి పంటకు ప్రాణం పోసే రైతు అప్పుల్లో ఉంటే అది దేశానికే తీరని లోటు. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి రైతు రాజయ్యేదెప్పుడో! *ఇవాళ జాతీయ <<18647657>>రైతు<<>> దినోత్సవం
News December 23, 2025
నాడు ఊరిలో సఫాయీ.. నేడు ఊరికే సర్పంచ్

TG: నిర్మల్ జిల్లా తానూర్ మండలం తొండాలకి చెందిన మిరేకర్ మాధవ్ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. 19 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆయన పోటీ చేసి గెలుపొందారు. నిన్న మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సఫాయీ కార్మికుడిగా ఉన్న తనను సర్పంచ్ చేసిన గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు.
News December 23, 2025
జుట్టు ఆరోగ్యం కోసం ఏం తినాలంటే?

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని సంరక్షించడంతో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. దీనికోసం బాదం, చిలగడదుంప, గుడ్డు, శనగలు, పాలకూర తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉండే బయోటిన్, ఐరన్, ఫోలేట్, విటమిన్ C ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. జుట్టు రాలిపోతున్నా, పలచగా ఉన్నా ఈ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


