News September 15, 2024
రేవంత్.. నీ గుండెల్లో నిద్రపోతా: హరీశ్
TG: రుణమాఫీ అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వదలిపెట్టనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తాను ఎక్కడా దాక్కోలేదని, అనుక్షణం రుణమాఫీని గుర్తు చేస్తూ మిగతాది చేసే వరకు గుండెల్లో నిద్రపోతానని చెప్పారు. వడ్లకు బోనస్ ఇస్తానని బోగస్‌గా మార్చిన సన్నాసి ఎవరని ప్రశ్నించారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే పూర్తిగా రుణమాఫీ జరగలేదని, దీనిపై చర్చకు సిద్ధమా అని రేవంత్‌కు సవాల్ విసిరారు.
Similar News
News October 3, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో రేపు ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
News October 3, 2024
11న మద్యం షాపుల కేటాయింపు: ఎక్సైజ్ శాఖ
AP: రాష్ట్రంలో లాబీయింగ్‌కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, 12 నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్‌ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
News October 3, 2024
నాలుగు భాషల్లో ప్రసంగించిన పవన్
AP: ‘వారాహి’ డిక్లరేషన్ కార్యక్రమంలో నాలుగు భాషల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. జాతీయ మీడియాకు అర్థమవ్వాలంటూ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఆయన ప్రసంగించారు. దీంతో పాటు తమిళంలోనూ ఆయన మాట్లాడారు. ఇక తెలుగులోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో పవన్‌కు బహు భాషల్లో ప్రావీణ్యం ఉందని ఆయన ఫాలోవర్స్ పోస్టులు చేస్తున్నారు.