News September 15, 2024
రేవంత్.. నువ్వు వెంపలి చెట్టంత కూడా పెరగలేదు కదా?: హరీశ్
TG: తనను తాడిచెట్టులా పెరిగానన్న CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ తీవ్రంగా స్పందించారు. ‘అవును నేను తాడి చెట్టంత ఎదిగాను. అది నాకు దేవుడు ఇచ్చాడు. అందులో తప్పేముంది. నువ్వు వెంపలి చెట్టంత కూడా పెరగలేదు కదా? ఇలాంటి చిల్లర మాటలు మానెయ్ రేవంత్. నీ స్థాయిని తగ్గించుకోకు. రుణమాఫీ చేశా అంటున్నావ్ కదా? నీ స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లి చూద్దాం మాఫీ జరిగిందో? లేదో?’ అని సవాల్ విసిరారు.
Similar News
News October 13, 2024
మాజీ మంత్రి హత్య.. సీఎం రాజీనామాకు విపక్షాల డిమాండ్
మహారాష్ట్రలో మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్దిఖీ దారుణ <<14343654>>హత్యకు<<>> గురికావడం సంచలనం రేపింది. దీనికి సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడణవీస్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని NCP(SP), శివసేన(UBT) డిమాండ్ చేశాయి. Y కేటగిరీ భద్రత కలిగిన రాజకీయ నేతనే కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలను ఏం కాపాడుతుందని ప్రశ్నించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తాయి.
News October 13, 2024
మీ పిల్లలకు ఇవి నేర్పుతున్నారా?
వయసు పెరిగే పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని స్కిల్స్ నేర్పించాలి. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, సాయం చేయడం వంటివి నేర్పాలి. చెట్లు నాటడం, సంరక్షణ, తోటి పిల్లలతో ఎలా మెలగాలో చెప్పాలి. డబ్బు విలువ తెలియజేయాలి, వస్తువులపై ధరలు, క్వాలిటీ వంటివి చూపించాలి. మార్కెట్‌లో బేరాలు ఆడటం నేర్పించాలి. ఎమోషనల్ బ్యాలెన్స్‌పై అవగాహన కల్పించాలి. పెద్దలను గౌరవించేలా తీర్చిదిద్దాలి.
News October 13, 2024
‘దసరా’ దర్శకుడితో నాని మరో మూవీ
‘దసరా’ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో హీరో నాని ఓ సినిమా చేయబోతున్నారు. దసరా సందర్భంగా ముహూర్త షాట్‌కు హీరో నాని క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.