News February 24, 2025
అసంతృప్తికరంగా రేవంత్ పాలన: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో 14 నెలల రేవంత్ ప్రభుత్వ పాలన అసంతృప్తిగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు రొటీన్‌గా చెల్లించాల్సిన బిల్లుల్లో సీలింగ్ పెట్టడం దారుణమన్నారు. కళాశాలల యాజమాన్యాల పట్ల సీఎం తీరు బాగాలేదన్నారు.
Similar News
News December 18, 2025
పట్టు రైతులకు రూ.14 కోట్లు విడుదల

AP: రాష్ట్రంలో పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి సిల్క్ సమగ్ర-2 పథకంలో భాగంగా రాష్ట్ర వాటా కింద రూ.14 కోట్ల నిధుల్ని పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 13,663 మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.
News December 18, 2025
రేషన్ కార్డుదారులకు అలర్ట్

TG: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే కొత్త సంవత్సరంలో సన్న బియ్యం కోటా నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కార్డుల్లో ఉన్న వారు రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది. ఐదేళ్ల లోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.
News December 18, 2025
హిల్ట్ పాలసీలో సవరణలకు ప్రభుత్వ యోచన

TG: HILT పాలసీలో కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 22 పారిశ్రామిక పార్కులలోని కంపెనీల యాజమాన్యాలు భూములను నివాస ప్లాట్లుగా మార్చడానికి దరఖాస్తు చేసుకోకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. త్వరలో వాటితో సమావేశం ఏర్పాటు చేసి పాలసీలో ప్రస్తుతం సవాలుగా ఉన్న సమస్యలపై చర్చిస్తామని ఉన్నతాధికారి ఒకరు ‘వే2న్యూస్’కు తెలిపారు. అవసరమైతే వారి అవసరాలకు అనుగుణంగా పాలసీలో మార్పులు చేస్తామని చెప్పారు.


