News January 3, 2025
సంక్రాంతి తర్వాత కూడా రెవెన్యూ సదస్సులు: మంత్రి అనగాని
AP: ఈనెల 8తో రెవెన్యూ సదస్సులు ముగుస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఉత్తరాంధ్రలో మాత్రం సంక్రాంతి తర్వాత కూడా 5 రోజులపాటు సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ‘సదస్సుల్లోనే అర్జీల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం 4 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌లో పెట్టింది. ఇందులో 25 వేల ఎకరాలే రిజిస్ట్రేషన్ చేసింది. దీనిలో 7 వేల ఎకరాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
Similar News
News January 22, 2025
ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ!
UPలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు PM మోదీ FEB 5న వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్‌రాజ్ చేరుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
News January 22, 2025
నేను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో: డివిలియర్స్
తాను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో అనే అనుభూతి చెందుతున్నట్లు డివిలియర్స్ చెప్పారు. బంతిని ఊచకోత కోసే ఇతను గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాలనే నిర్ణయంతోనే ఇలా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నా కళ్లు ఇంకా పని చేస్తున్నాయి. గ్రౌండ్‌కు వెళ్లి బంతులను కొడుతూ మళ్లీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు. దీంతో త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని ఏబీ ఫ్యాన్స్ SMలో కామెంట్లు పెడుతున్నారు.
News January 22, 2025
నేడే ఇంగ్లండ్‌తో తొలి T20.. కళ్లన్నీ షమీపైనే
స్వదేశంలో ఇంగ్లండ్‌తో 5T20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్ తొలి T20 కోల్‌కతాలో ఆడనుంది. SKY సారథ్యంలో ధనాధన్ ఆటకు జట్టు సిద్ధమైన వేళ స్టార్ పేసర్ షమీపైనే కళ్లన్నీ ఉన్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టులో చేరిన షమీ ఆశించిన స్థాయిలో రాణిస్తే CTలో భారత్‌కు ఎక్స్‌ఫ్యాక్టర్‌గా మారనున్నారు. అటు విజయంతో సిరీస్ ప్రారంభించాలని ఇంగ్లండ్ వ్యూహాలు రచిస్తోంది. రాత్రి 7 గం.కు స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ లైవ్ చూడవచ్చు.