News August 28, 2024
రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసిన ప్రభుత్వం

AP: రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర <<13958383>>మంత్రివర్గం<<>> నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను కొనసాగించేందుకు అంగీకరించింది. పట్టాదారు పాస్‌బుక్‌లపై జగన్ బొమ్మ తొలగింపు, వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు ఆమోదం తెలిపింది.
Similar News
News April 17, 2026
ఉత్తర, దక్షిణాది మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి

డీలిమిటేషన్‌పై ఉత్తరాది, దక్షిణాది మధ్య గొడవలు సృష్టించాలని విపక్షాలు చూస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో విమర్శించారు. 2 ప్రాంతాల మధ్య యుద్ధం వస్తుందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని మోదీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. మరోవైపు పార్లమెంటులో నిన్న BJP MP తేజస్వీ సూర్య TG ప్రజలను అవమానించేలా మాట్లాడలేదని తెలిపారు.
News April 17, 2026
పరుచూరి చెప్పిన జీవిత సూత్రం!

అతి మంచితనం, మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోవడం వల్ల జీవితంలో అనేక చిక్కులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాటిచ్చి ఇబ్బందుల్లో పడేవారు చాలామంది. దీనిపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరికైనా మాట ఇచ్చేముందు పదిసార్లు ఆలోచించాలి. నోరు విప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయానుకూలంగా NO చెప్పడం నేర్చుకోండి’ అని ఆయన సూచించారు.
News April 17, 2026
దేవుడి కంటే BCCI వద్దే ఎక్కువ డబ్బు.. అయినా: లలిత్ మోదీ

భారత్‌లో ఉన్న స్టేడియాలపై IPL ఫౌండర్ లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. BCCI వద్ద దేవుడి కంటే ఎక్కువ డబ్బు ఉందని, అయినా స్టేడియాల దుస్థితి మారట్లేదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. BCCI వాటిని కూల్చేసి కొత్తవి నిర్మించాలని తెలిపారు. ఇక 2030 నాటికి IPLలో ఒక్కో అగ్రశ్రేణి ఆటగాడు రూ.150CR వరకు సంపాదిస్తారని జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఆటగాళ్లు దేశ జట్టు కంటే IPLకే ప్రాధాన్యతనిస్తారన్నారు.


