News March 29, 2025
‘ఆర్‌జీ కర్’ ఘటన గ్యాంగ్ రేప్ కాదు: CBI

RGకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగింది గ్యాంగ్ రేప్ కాదని కలకత్తా హైకోర్టుకు CBI తెలిపింది. సంజయ్ రాయ్ అన్న ఒకే నిందితుడు ఆ ఘోరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం తమకు లభించిన ఆధారాలు, నిపుణుల అభిప్రాయాలూ అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని వివరించింది. అయితే కేసులో మరింత పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు అనుమానాలున్నాయని, వాటిని విచారిస్తున్నామని కోర్టుకు విన్నవించింది.
Similar News
News April 21, 2025
పిట్టలవానిపాలెం: ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి

ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందిన ఘటన పిట్టలవానిపాలెం మండలంలో ఆదివారం చోటుచేసుకొంది. చందోలు ఎస్ఐ శివకుమార్ వివరాల మేరకు.. మండలంలోని అలకాపురంలో కనకా రెడ్డి ట్రాక్టర్‌తో రొయ్యల చెరువు కట్టను వెడల్పు చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడటంతో ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
News April 21, 2025
వాకింగ్ ఎంత వేగంతో చేస్తున్నారు?

ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఎంతవేగంతో ఎంతసేపు నడుస్తున్నామనేది చాలా ముఖ్యం. గంటకు 6.4 కి.మీ వేగంతో నడిస్తే గుండె దడ, హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గుల సమస్యలు 43 శాతం తగ్గుతాయని గ్లాస్గో వర్సిటీ(UK) అధ్యయనం వెల్లడించింది. 4.20 లక్షల మంది వాకర్స్ నుంచి 13 ఏళ్లపాటు డేటాను సేకరించి ఈ వివరాలను తెలిపింది. వేగంగా నడిస్తే బరువు, రక్తంలో కొవ్వు, జీర్ణ సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.
News April 21, 2025
రేపే ఇంటర్ ఫలితాలు

TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ వస్తాయి. మార్క్స్ లిస్ట్‌ను ఈజీగా షేర్ చేసుకోవచ్చు.