News December 4, 2024
పుష్ప-2 ఇడ్లీల పేరుతో RGV ట్వీట్

సినిమాలు లాభాల కోసమే నిర్మిస్తారని, ప్రజా సేవకు కాదని RGV అన్నారు. సుబ్బారావు అనే వ్యక్తి హోటల్ పెట్టి ఇడ్లీ ప్లేట్ రూ.1000గా నిర్ణయించారని, ధర అందుబాటులో లేదని ఏడిస్తే అది సెవెన్ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనమన్నారు. అలాగే పుష్ప-2ది సెవెన్ స్టార్ క్వాలిటీ అన్నారు. అటు, ఎంటర్టైన్మెంట్ అంత నిత్యావసరమా? రేట్లు తగ్గాక కూడా చూసుకోవచ్చు కదా? అని ‘X’లో పోస్ట్ చేశారు.
Similar News
News February 11, 2026
‘టాయ్‌లెట్ పేపర్ కన్నా దారుణంగా’.. అమెరికాపై పాక్ మంత్రి ఫైర్

అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాక్‌ను పావుగా వాడుకుంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మండిపడ్డారు. టాయ్‌లెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. 1999 తర్వాత US మద్దతు కోసం అఫ్గాన్ యుద్ధంలోకి దిగడం తమకు తీరని నష్టం కలిగించిందని వాపోయారు. దశాబ్దాల తర్వాత కూడా పర్యవసానాలు అనుభవిస్తున్నామన్నారు. జిహాద్ పేరుతో తమ పౌరులను పోరాటానికి పంపామని పార్లమెంటులో అంగీకరించారు.
News February 11, 2026
టెట్ రిజల్ట్స్.. 42% టీచర్లు అనర్హులే!

TG: నిన్న విడుదలైన టెట్ <<19104650>>ఫలితాల్లో<<>> ఏకంగా 27,712(42%) మంది ఇన్ సర్వీస్ టీచర్లు అర్హత సాధించలేదు. మొత్తం 65,605 మంది టీచర్లు పరీక్షకు హాజరయ్యారు. టెట్ ప్రవేశ పెట్టకముందు నియమితులై ఐదేళ్లకు మించి సర్వీసులో ఉన్న టీచర్లు రెండేళ్లలోపు ఒక్కసారైనా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఓవరాల్‌గా 1,95,181 మంది పరీక్ష రాయగా 1,00,270 మంది(51.37%) క్వాలిఫై అయ్యారు.
News February 11, 2026
గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.


