News December 1, 2024

మూడేళ్లలో రూ.45వేల కోట్ల విలువైన బియ్యం ఎగుమతి: నాదెండ్ల

image

AP: వైసీపీ హయాంలో కాకినాడ పోర్టులోకి రాష్ట్ర అధికారులు ఎవరూ వెళ్లకుండా కుట్ర చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘మూడేళ్లలోనే రూ.45వేల కోట్ల విలువైన కోటీ 31 లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారు. ఇంత భారీ దోపిడీ జరిగింది కాబట్టే మేం పోర్టుపై ప్రత్యేక దృష్టిసారించాం. రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9వేలకు పైగా వ్యాన్లు కొని, వాటి ద్వారానే బియ్యాన్ని పోర్టుకు తరలించారు’ అని ఆరోపించారు.

Similar News

News February 18, 2026

దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి: మాధవ్

image

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో రాష్ట్రీయ RSS సభ్యులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్రంగా డిమాండ్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఒక జాతీయవాద సంస్థ అని అన్నారు. అటువంటి సంస్థ సభ్యులపై దాడికి పాల్పడడం అంటే కమ్యూనిస్టులు అరాచకత్వానికి పరాకాష్టగా అని అన్నారు.

News February 18, 2026

రోజూ హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నారా?

image

హ్యాండ్ బ్యాగ్ కొందరికి అవసరం. కానీ దాంట్లో అనవసరమైన వస్తువులు పెట్టి దాన్ని బరువుగా మారుస్తున్నారు చాలామంది. దాన్ని స్టైల్​గా చేత్తో పట్టుకోవడమో, భుజానికి వేసుకోవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో కండరాలు, ఎముకలపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు పోశ్చర్ మారిపోతుంది. కాబట్టి బ్యాగును చేతులు మారుస్తూ పట్టుకోవడం, లగేజ్ ఎక్కువగా ఉంటే బ్యాక్ ప్యాక్ వాడటం మంచిదని సూచిస్తున్నారు.

News February 18, 2026

YouTube డౌన్

image

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.