News October 9, 2024

రిచెస్ట్ నటి.. ఆమె ఆస్తి రూ.66వేల కోట్లు!

image

ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన నటుడిగా $1.4 బిలియన్లతో టైలర్ పెర్రీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకంటే కూడా సినీరంగంలో మోస్ట్ రిచెస్ట్ నటి ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. అమెరికన్ నటి జామీ గెర్ట్జ్ ప్రపంచంలోనే ధనవంతురాలని పేర్కొంది. గెర్ట్జ్ నికర విలువ $8 బిలియన్లు ( ₹ 66,000+ కోట్లు). ఆ తర్వాతి స్థానాల్లో టేలర్ స్విఫ్ట్ ($1.6 బిలియన్), రిహన్నా ($1.4 బిలియన్), సెలెనా గోమెజ్ ($1.3 బిలియన్) ఉన్నారు.

Similar News

News March 9, 2025

లోక్ అదాలత్ ఎఫెక్ట్.. ఒక్క రోజులో 49,056 కేసుల పరిష్కారం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్‌లలో 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం బాధితులకు రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. అన్ని న్యాయస్థానాల్లో 343 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించగా ఇరు వర్గాల ఆమోదంతో రాజీకి ఆస్కారం ఉన్న కేసులను పరిష్కరించారు.

News March 9, 2025

RRRకు త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ: కిషన్ రెడ్డి

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR)కు త్వరలో PM మోదీ భూమి పూజ చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు నిధులు లేవన్నా తానే నితిన్ గడ్కరీని ఒప్పించినట్లు చెప్పారు. కొద్దిరోజుల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందుతుందని తెలిపారు. RRRకు తమ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం రూ.100కోట్లే ఇచ్చి కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించారు.

News March 9, 2025

గ్రూప్-1 ఫలితాలు.. UPDATE

image

రేపు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ముందుగా మార్కులను ప్రకటించనుండగా తర్వాత రీకౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాశారు.

error: Content is protected !!