News December 3, 2024
22 ఏళ్లకే రిటైరైన రిచెస్ట్ క్రికెటర్: ఆస్తి రూ.70వేల కోట్లు

సచిన్, ధోనీ, కోహ్లీ ఆస్తులన్నీ కలిపినా అతడి నెట్‌వర్త్‌లో ఐదో వంతు ఉండవు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆడింది 9 మ్యాచులే. ఆస్తి మాత్రం రూ.70వేల కోట్లు. అతడే 27ఏళ్ల ఆర్యమాన్ బిర్లా. కుమార మంగళం బిర్లా కుమారుడితను. రంజీ ట్రోఫీలో MP తరఫున ఆడి తన సత్తా చాటారు. IPLలో రెండేళ్లు RRతో ఉన్నా ఆడే ఛాన్స్ రాలేదు. గాయాలతో క్రికెట్‌కు నిరవధిక విరామం ప్రకటించారు. ఈ బిర్లాగ్రూప్ వారసుడు ABFRLలో ప్రస్తుతం డైరెక్టర్.
Similar News
News February 8, 2026
రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.
News February 8, 2026
సెట్‌లో తాగుబోతును చితకబాదా: సాయి ధన్సిక

తాను నటించిన ‘యోగిడా’ మూవీ సెట్‌లో ఓ వ్యక్తిని చితకబాదినట్లు హీరోయిన్ సాయి ధన్సిక తెలిపారు. ‘కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదు. దీంతో అంకుల్‌ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని చితకబాదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో విశాల్‌తో ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగింది.
News February 8, 2026
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం


